పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల జరిగిన ఎన్నికలలో ఒకే ఒక్క సీటు గెలుచుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికలలో ఓడిపోవడంతో పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లోకి వస్తారనే వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. అయితే జనసేనాని మాత్రం సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. అయితే ఎన్నికల సమయంలో, ఫలితాల సమయంలో… మొన్నటివరకు గుబురు గడ్డం, భారీ జుట్టుతో కన్పించిన పవన్ కళ్యాణ్ తాజాగా కొత్త లుక్ లో కన్పిస్తున్నారు. గడ్డాన్ని ట్రిమ్ చేసి జట్టు కత్తిరించుకున్నారు. దీంతో పవన్ తాజా లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా మళ్లీ సినిమాల్లో నటించబోతున్నారు అనే వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. అయితే అమెరికాలో జరుగబోయే తానా సభలకు పవన్ హాజరుకాబోతున్నారని, అందుకోసం కొత్త లుక్‌లోకి మారారని అంటున్నారు. పవన్ సినిమాల్లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్న సంగతి తెలిసిందే.
							previous post
						
						
					

ఆరెస్సెస్ చీఫ్ వ్యాఖ్యలపై సోనమ్ కపూర్ ఫైర్