ఉభయగోదావరి జిల్లాల ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించే దిశగా రూ.3,050 కోట్లతో అమరజీవి జలధార ప్రాజెక్ట్ పనులకు నేడు శంకుస్థాపన చేసిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.

ఉభయగోదావరి జిల్లాల ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం కీలక అడుగు వేసింది.
అధునాతన సాంకేతికతతో గోదావరి జలాలు శుద్ధి చేసి ఇంటింటికీ తాగునీరు పంపిణీ చేసే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం, 68 లక్షల మంది ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం.
అమరజీవి జలధార ద్వారా చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 5 జిల్లాల పరిధిలో 7,910 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టనున్నారు.
ఈ ప్రాజెక్టుల ద్వారా వచ్చే 35 ఏళ్లలో 1.2 కోట్ల మంది ప్రజలకు సురక్షిత తాగునీరు అందించి దాహం తీర్చాలని సంకల్పించారు.
ముఖ్యంగా ఉమ్మడి గోదావరి జిల్లాల్లో తీరం వెంబడి నివసించే మత్స్యకార సోదరులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఎక్కువ తీర ప్రాంతాలను కలిపేలా ఈ ప్రాజెక్ట్ రూపకల్పన జరిగింది.

