క్రికెట్ ప్రపంచం ఎంతగానో ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ మరోసారి ఢీ కొట్టాయి. టీ20 వరల్డ్ కప్ 2021 భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో చారిత్రాత్మక విజయాన్ని సొంతం పాకిస్థాన్ చేసుకుంది. ఐసీసీ ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో ప్రతిసారీ భారత్ చేతిలో ఓటమి పాలైన పాకిస్తాన్ ఈసారీ దకూడు పెంచింది. ఇంకా 13 బంతులు మిగిలుండగానే పాకిస్తాన్ 152 పరుగుల విజయ లక్ష్యం అందుకుంది.
షమీ వేసిన 18వ ఓవర్లో మహమ్మద్ రిజ్వాన్ వరసగా 6, 4, 4, 1 పరుగులు కొట్టగా, ఐదో బంతికి 2 పరుగులు చేసిన కెప్టెన్ బాబర్ అజాం జట్టును విజయతీరాలకు చేర్చాడు.హాఫ్ సెంచరీలు చేసిన ఓపెనర్లు బాబర్ అజాం, మొహమ్మద్ రిజ్వాన్ జట్టుకు చారిత్రక విజయం అందించారు.మొహమ్మద్ రిజ్వాన్ 55 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 79 పరుగులు చేయగా, కెప్టెన్ బాబర్ అజాం 52 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 68 పరుగులు చేశాడు. దీంతో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా పాక్ జయ కేతనాన్ని ఎగరవేసింది.
భారత్ బ్యాటింగ్…
ఇక టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు మొదటి ఓవర్లోనే పెద్ద షాక్ తగిలింది.. పాకిస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంలో తొలి ఓవర్లలోనే రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. కాసేపటికే రాహుల్ మూడు పరుగులు చేసి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. వీరిద్దరి వికెట్లను షహీన్ ఆఫ్రిది తీశాడు. ఐదో ఓవర్లో సూర్య కుమార్ కేవలం 11 పరుగులే చేసి క్యాచ్ ఔటయ్యాడు. (49 బంతుల్లో 57; 5 ఫోర్లు, 1 సిక్సర్
టీమిండియా బ్యాట్స్‌మెన్‌లో కేవలం విరాట్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత్‌ను విరాట్ ఆదుకున్నాడు. 49 బంతుల్లో 57; 5 ఫోర్లు, 1 సిక్సర్ పరుగులు చేశాడు. హార్దిక్ రెండు ఫోర్లు కొట్టి చివరి ఓవర్లో వెనుదిరిగాడు.దీంతో భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది.
డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌కు వ్యాఖ్యాతగా దినేష్ కార్తీక్…?