telugu navyamedia
రాశి ఫలాలు

అక్టోబర్ 25, సోమవారం రాశిఫలాలు..

మేష రాశి
ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. ధనవ్యయం. శ్రమాధిక్యం. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన ఏర్ప‌డ‌తాయి. దూర‌ ప్రయాణాలు అనుకూలిస్తాయి.వివాదాలకు దూరంగా ఉండడం మేలు చేస్తుంది.

వృషభ రాశి
విద్యార్థులకు అనుకూల ఫలితాలు.శస్త్రచికిత్సలు విజయవంతం కావటంతో డాక్టర్లు పేరు, ప్రఖ్యాతులు గడిస్తారు.బ‌సంఘంలో గౌరవం ల‌భిస్తుంది. విలువైన వస్తువులు సేకరిస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం క‌లుగుతుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. అనవసర ఖర్చులకు దూరంగా ఉండడం మంచిది.

మిధున రాశి
ఆరోగ్యభంగం… పనులలో జాప్యం. వ్యయప్రయాసలు. వ్యాపార, ఉద్యోగాలలో కొన్ని మార్పులు. దైవదర్శనాలు. ఖర్చులను నియంత్రిచుకోవడం మంచిది. బంధువులతో వివాదాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. దైవారాధన పట్ల ఆశక్తి పెరుగుతుంది. గృహంలో మార్పులు చేర్పులు వాయిదా పడతాయి.

కర్కాటక రాశి
పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు తరుచు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. కొత్త పనులు చేపడతారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక ప్రగతి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

సింహ రాశి
కొత్త పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. దంపతుల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి. కీలక నిర్ణయాలు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రంగాల్లోని వారు మంచి లాభాలు పొందుతారు.

కన్య రాశి
చేపట్టిన పనుల్లో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. అనారోగ్యం. బంధువులను కలుసుకుంటారు. స్త్రీలకు ప్రకటనలు, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం.వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

తులా రాశి
దూరప్రయాణాలు. పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. అనుకోని ధనవ్యయం. పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు కలసిరావు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. తరుచూ దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.విద్యా రంగంలో ఉన్నవారు మంచి విజయాలను సొంతం చేసుకుంటారు.

వృశ్చిక రాశి
బంధువుల సలహాలు స్వీకరిస్తారు. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసర విషయాల్లో తలదూర్చుకుండా ఉంటే మంచిది.ఆహ్వానాలు అందుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. వస్తు, వస్త్రలాభాలు. విందువినోదాలులో పాల్గొంటారు.

ధనుస్సు రాశి
సోదరీ, సోదరులతో కలయిక, పరస్పర అవగాహన కుదురును. పనులలో విజయం చేకూరుతుంది. శుభవార్తలు అందుతాయి. శ్రమకు ఫలితం కనిపిస్తుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి. విచిత్రమైన సంఘటనలు త‌లేత్తుతాయి.

మకర రాశి
స్త్రీలకు షాపింగ్‌లో ఎకాగ్రత, మెళుకువ అవసరం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మానసిక ప్రశాంతత చేకూరుతుంది.

కుంభ రాశి
ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో నిరుత్సాహం. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి మార్పులు. కుటుంబ సభ్యులతో సంతోషముగా గడుపుతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది.

మీన రాశి
మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. ఉద్యోగయత్నాలు సానుకూలం. విలువైన వస్తువులు సేకరిస్తారు. బంధువుల కలయిక. ఆస్తిలాభం. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత. విందువినోదాలులో పాల్గొంటారు.కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు.

Related posts