తాజా బీసీసీఐ వార్షిక ఒప్పంద జాబితాలో ధోనీ స్థానం కోల్పోయిన నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ధోనీ ఇక రిటైర్మెంట్ గురించి సీరియస్‌గా ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైందంటూ వ్యాఖ్యానించాడు. ‘సెలెక్టర్లు ఇప్పటికే ధోనీని ఎంపిక చేయకూడదనే నిర్ణయానికి వచ్చేసుంటారు. దీంతో బీసీసీఐ కూడా ఓ నిర్ణయానికి వచ్చేసి అతనితో ఒప్పందం చేసుకోలేదని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. బీసీసీఐ వార్షిక ఒప్పంద జాబితాలో లేకపోవడం అంటే.. ‘నీకు ఇష్టమైనప్పుడు ఆట నుంచి తప్పుకో’ అనే సందేశం ధోనీకి అందినట్లేనని సెహ్వాగ్ పేర్కొన్నాడు.
previous post