ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో రిషభ్ పంత్‌పై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని ఈ కివీస్ బౌలింగ్ కోచ్ చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాపై పంత్ ఎదురుదాడికి దిగిన విషయాలపై తాము అధ్యయనం చేసామని, ప్రత్యేక ప్రణాళికలతో పంత్‌ను కట్టడి చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశాడు. సౌతాంప్టన్ వేదికగా జూన్ 18 నుంచి 22 వరకు భారత్, న్యూజిలాండ్ మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మెగా ఫైట్ నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడిన షేన్ జర్గెన్ సెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా బౌలింగ్ అటాక్ పై కూడా ప్రశంశల వర్షం కురిపించాడు. బుమ్రా, షమీ, సిరాజ్, ఇషాంత్‌లతో కూడిన టీమిండియా పేస్ దళం అద్భుతంగా ఉందని కొనియాడాడు. ‘రిషభ్ పంత్ అత్యంత ప్రమాదకరమైన ప్లేయర్. క్షణాల్లో ఆటను మార్చేయగలడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ సిరీసుల్లో అతను ఎంత బాగా ఆడాడో మనమంతా చూశాం. పంత్ సానుకూల ఆలోచనా ధోరణితో ఆడుతాడు. కానీ అదే అతడి వికెట్ తీయడానికి మాకు అవకాశంగా మారుతుంది. మా బౌలర్లు అత్యంత కచ్చితత్వంతో బంతులు వేయాలి. ప్రశాంతంగా ఉండాలి. పంత్ పరుగులు చేయకుండా ఇబ్బంది పెట్టాలి. ఎందుకంటే అతను స్వేచ్ఛగా ఆడే బ్యాట్స్‌మన్. పైగా ఆపడం కష్టం. మా బౌలర్లు ఈ విషయం గుర్తు పెట్టుకోవాలి అని జర్గెన్‌సెన్ తెలిపాడు.
previous post

