telugu navyamedia
రాశి ఫలాలు

న‌వంబ‌ర్ 8, సోమవారం రాశిఫ‌లాలు..

మేష రాశి..

మీ సంతానంతో దైవ, సేవా, పుణ్య కార్యక్రమాలలో పాల్గొంటారు. కీలక వ్యవహారాలపై దృష్టిసారించాలి. శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబసభ్యుల సలహాలు సూచనలు పాటించాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. అనారోగ్యం క‌లుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు ఏర్ప‌డ‌తాయి.

వృషభ రాశి..

రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఉపాధ్యాయులకు పనిభారం తగ్గుతుంది. బంధుమిత్రులతో కలిసి నూతన కార్యాలను ప్రారంభిస్తారు. బంధవులు, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యంపై దృష్టిపెట్టాలి. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు ఏర్ప‌డ‌తాయి.

మిథున రాశి..

స్త్రీలు టి.వి., ఛానల్స్ కార్యక్రమాలలో రాణిస్తారు..కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ.. మనోధైర్యంతో ముందుకు సాగాలి. బుద్ధిబలాన్ని ఉపయోగించి ఆటంకాలను అధిగమిస్తారు. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. స్త్రీలు టి.వి., ఛానల్స్ కార్యక్రమాలలో రాణిస్తారు.

కర్కాటక రాశి..

పరిశ్రమలు, సంస్థలకు కావలసిన లైసెన్సులు, పర్మిట్లు మంజూరు కాగలవు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. అనుకూల పరిస్థితులు ఉన్నాయి. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. జాగ్రత్తలు అవసరం.ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం అందుకుంటారు.

సింహరాశి..

చేపట్టిన పనులను వేగంగా పూర్తిచేస్తారు. పనులకు ఆటంకం కలుగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. ఆచితూచి అడుగేయాలి. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు లభిస్తుంది. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారులకు సంతృప్తి నిస్తుంది. మిత్రుల నుంచి ఒత్తిడులు ఏర్ప‌డ‌తాయి. ఆలయాలు సందర్శిస్తారు.

కన్య రాశి..

స్త్రీలు తెలియని అశాంతికి గురవుతారు. శారీరక శ్రమ పెరగడంతోపాటు అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. ముఖ్య విషయల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబంలో చికాకులు నెల‌కొంటాయి. ఆరోగ్య సమస్యలు ఏదుర‌వుతాయి. దైవదర్శనాలు చేస్తారు.

తుల రాశి..

అన్ని పనులను సకాలంలో పూర్తిచేస్తారు. విదేశీయాన యత్నాలలో పురోభివృద్ధి పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఒత్తిడి తప్పదు. ముఖ్య విషయాల్లో జాగ్రత్త అవసరం. ప్రయాణాలు చేసే అవకాశముంది. శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం పొందుతారు.

వృశ్చిక రాశి..

వైద్య, ఇంజనీరింగ్ రంగాల్లో వారికి మెళకువ అవసరం. రావలసిన ఆదాయం అందటంతో ఆర్థికంగా ఒకడుగు ముందుకేస్తారు.ఈ రాశివారికి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. కొన్ని సంఘటనలు మనోవేదనకు గురిచేస్తాయి. గొడవలకు దూరంగా ఉండాలి. ఉద్యోగాలలో ఆటుపోట్లు ఏదురవుతాయి.

ధనుస్సు రాశి..

విదేశీయ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు నిర్మాణ పనుల్లో ఒత్తిడి, సమస్యలు తప్పవు. అనుకోని శుభవార్త వింటారు. అవసరానికి ఆర్థిక సహాయం అందుతుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.

మకర రాశి..

బంధువులతో తెగిపోయిన సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. చేపట్టిన పనులను ప్రణాళికాబద్దంగా సకాలంలో పూర్తిచేస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అనవసర వ్యవహారాల్లో తలదూర్చకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులను కలుసుకుంటారు.

కుంభ రాశి..

శ్రమ పెరిగినప్పటికీ… అనుకూల ఫలితాలు వస్తాయి. గొప్పగొప్ప ఆలోచనలు, ఆశయాలు స్ఫురిస్తాయి. విద్యార్థులకు పోటీ పరీక్షల ఒత్తిడి, విశ్రాంతి లోపం వంటి చికాకులు అధికం. ముఖ్యమైన సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. బంధుమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. సేవా కార్యక్ర‌మాల్లో పాల్గొంటారు.

మీన రాశి..

నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖుల నుంచి పిలుపు వ‌స్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అనుకున్న పనులను ప్రణాళికాబద్దంగా పూర్తిచేస్తారు. శారీరక శ్రమ పెరిగుతుంది. బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు.విద్యార్థినుల నిర్లక్ష్యం, ఏకాగ్రత లోపం వల్ల ఒత్తిడి, మందలింపులు అధికమవుతాయి.

Related posts