ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అటవీ శాఖలో ఖాళీగా ఉన్న వంద పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (ఎఫ్ఎస్ఓ) ఉద్యోగాలను భర్తీ చేయడానికి కూటమి ప్రభుత్వం తాజాగా నియామక ప్రకటన విడుదల చేసింది.
ఈ నెల 28 నుంచి ఆగస్టు 17వ తేదీ వరకూ ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించి, సెప్టెంబర్ లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొంది.
ఎంపికైన అభ్యర్థులకు శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, విజయనగరం, విశాఖపట్నం, అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూల్ జిల్లాల్లోని డివిజన్లలో పోస్టింగ్ చేయనున్నట్లు తెలిపింది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వయోపరిమితి 18 నుంచి 30 ఏళ్లుగా నిర్ణయించింది.
రిజర్వేషన్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపు ఉంటుందని తెలిపింది.
చంద్రబాబుకు ఓటు ద్వారా రాజకీయ శిక్ష: మందకృష్ణ