telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“పెపెటా” సాంగ్ పై నోరా ఫతేహీ డ్యాన్స్… వీడియో వైరల్

Pepeta

బాలీవుడ్ నటి నోరా ఫతేహీ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తూ దుమ్మురేపుతోంది. ఇటీవల ఆమె చేసిన “దిల్బర్…” సాంగ్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తెలుగులో “బాహుబలి – ది బిగినింగ్”లో “మనోహరి” పాటకు నర్తించిన నోరా ఫతేహి “కిక్-2”, “ఊపిరి” తదితర చిత్రాల్లోనూ కనిపించింది. ఇటీవలే విడుదలైన “భారత్” సినిమాలో నోరా లాటిన్ అమెరికా యువతి పాత్రలో కనిపించింది. తాజాగా ఈ బ్యూటీ రే వాన్నీతో కలిసి చేసిన “పెపెటా” మ్యూజిక్ వీడియో ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇపుడు ఇదే పాటకు మరోసారి స్టెప్పులేసి ఇరగదీసింది మొరాకో బ్యూటీ నోరా. ఇటీవలే నోరా కొరియోగ్రాఫర్ మెల్విన్ లూయిస్‌తో కలిసి ఇదే సాంగ్‌కు చేసిన డ్యాన్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. “పెపెటా” పాటను అబ్దెర్రఫియా డైరెక్ట్ చేయగా… ఎస్2 కిజ్జీ, తిజఫ్ మొహ్‌సిన్ కంపోజ్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ వీడియోను మీరు కూడా వీక్షించండి.

Related posts