ఆంధ్రప్రదేశ్‌లో జనసేనపార్టీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రాపాకకు మరోసారి అవమానం జరిగింది.. గుంటూరు జిల్లాలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకల దగ్గర రాపాక నో ఎంట్రీ అనే ఫ్లెక్సీలు జనసైనికులు ఏర్పాటు చేశారు.
జనసేన పార్టీ ఏర్పాటై 8సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో ..ఆ పార్టీ శ్రేణులు, అధ్యక్షుడు గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం ఇప్పటంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు.
జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఆవరణలో కొన్ని పోస్టర్లు చర్చనీయాంశంగా మారాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా రాజోలు నియోజకవర్గం నుంచి రాపాక వరప్రసాద్ గెలుపొందారు. రాష్ట్రంలో జనసేనకు ఉన్న ఏకైక ఎమ్మెల్యే ఆయనొక్కరే.
సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత రాపాక వరప్రసాద్ జనసేన నిర్వహించిన అనే కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అంతే కాదు వైసీపీకి మద్దతుగా అటు అసెంబ్లీలో, బయట తన వైఖరిని వ్యక్తపరుస్తూ వచ్చారు.
ఇలాంటి పరిస్థితుల్లో జనసేన సైనికులు రాపాక వరప్రసాద్‌కి వ్యతిరేకంగా ఆయన ఫోటోతో కూడిన పోస్టర్లు ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి



చంద్రబాబుపై కోపంతో జగన్ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తారో: సోమిరెడ్డి