దశాబ్దాల పోరాటం తర్వాత నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు కల ఎట్టకేలకు సాకారం అయింది.
నిజామాబాద్ పసుపు రైతులు దాదాపు 40 ఏళ్లుగా పసుపు బోర్డు కోసం పోరాడగా.. ఈ ఏడాది జనవరి 14న కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డు ఏర్పాటుపై అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
ఆ తర్వాత కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ ఈ బోర్డును వర్చువల్‌గా ప్రారంభించారు.
అనంతరం భవనం నిర్మాణం జరిగి పూర్తి స్థాయిలో నిజమాబాద్‌లోని వినాయక నగర్‌లో కొలువుదీని పసుపు బోర్డును.. ఆదివారం కేంద్ర హోమంత్రి అమిత్‌షా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రసంగించిన అమిత్ షా.. పసుపు రైతుల 40 ఏళ్ల కలను ప్రధాని నరేంద్ర మోదీ నెరవేర్చారన్నారు.
అంతేకాకుండా తెలంగాణ పసుపు రైతల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నిజామాబాద్ పసుపుకు రాజధాని లాంటిదని ఆయన కొనియాడారు.
ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క.. ఎంపీలు ధర్మపురి అరవింద్ , కె లక్ష్మణ్, పసుపు బోర్డు చైర్మన్ గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ బోర్డు ఏర్పాటుతో నిజామాబాద్ పసుపుకు.. వరల్డ్ వైడ్‌గా మరింత ఆదరణ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
పసుపు బోర్డును తన చేతుల మీదుగా ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నట్లు అమిత్ షా చెప్పారు. తెలంగాణ పసుపు రైతుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉందని ఆయన హామీ ఇచ్చారు.
పసుపు బోర్డు ఏర్పాటు కోసం బీజేపీ ఎంపీలు చేసిన కృషిని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.
అంతేకాకుండా, ఈ బోర్డుకు చైర్మన్‌గా తెలంగాణ వ్యక్తి అయిన పల్లె గంగారెడ్డిని నియమించడం తమ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని ఆయన వెల్లడించారు.
పసుపు కేవలం ఒక పంట మాత్రమే కాదని, అది ఒక దివ్య ఔషధమని అని అమిత్ షా చెప్పారు.
యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియా, యాంటీ క్యాన్సర్ లక్షణాలు ఇందులో ఉన్నాయని ఆయన వివరించారు.
2030 నాటికి ఒక బిలియన్ డాలర్ల విలువైన పసుపును ఎగుమతి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
ఈ బోర్డు ద్వారా రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై శిక్షణ ఇస్తామని, ఇక్కడి పసుపు పంటకు జియో ట్యాగింగ్ కూడా చేస్తున్నామని చెప్పారు.
భారత్ కో ఆపరేటివ్ సొసైటీ ద్వారా రైతులందరికీ ప్రయోజనం చేకూర్చడానికి కృషి చేస్తున్నామని ఆయన అన్నారు.
కేటీఆర్ ఫోన్ చేయగానే ఈటల తుస్సుమనిపించాడు: రేవంత్ రెడ్డి