ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ గా రాజానగరం ఎమ్మెల్యే, వైసీపీ నేత జక్కంపూడి రాజా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని ఎ1 కన్వెన్షన్ సెంటర్ లో ఈ ఉదయం 10 గంటలకు ఆయన బాధ్యతలు స్వీకరించారు. జక్కంపూడి రాజాను చైర్మన్ గా నియమిస్తూ ఇటీవలే ఉత్తర్వులు విడుదలైన సంగతి తెలిసిందే.
దివంగత జక్కంపూడి కుమారుడు కావడం, కాపు యువతలో ఉన్న మంచి పేరు కారణంగా సీఎం వైఎస్ జగన్, ఈ పదవిని రాజాకు అప్పగించారు. ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది కాపు కార్యకర్తలు హాజరయ్యారు.