telugu navyamedia
సినిమా వార్తలు

ప‌వ‌న్‌కు జోడీ కుదిరింది..!

ప‌వ‌ర్‌స్టార్‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ద‌గ్గుపాటి రానా ప్రాధాన ప్రాత్ర‌ల్లో న‌టిస్తున్న సినిమాలో హీరోయిన్ నిత్యామీన‌న్ ఎంట్రీ ఇచ్చింద‌ని చిత్ర‌యూనిట్ అధికార‌క ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. మలయాళ హిట్ సినిమా అయిన అయ్యప్పనుమ్ కోషియుమ్‌ను తెలుగులో రీమేక్ చేస్తోన్నారు. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, మాటలు త్రివిక్రమ్ అందిస్తుండ‌గా, యువ దర్శకుడు సాగర్ కే చంద్ర ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా సగానికి పైగానే పూర్తయింద‌ట‌. నిత్యా మీనన్ ఈ సినిమాలో పవన్ ప‌క్క‌న‌ ఆయన భార్యగా నటించనుందని తెలుస్తోంది. పవన్ ఈ సినిమాలో భీమ్లా నాయక్‌గా కనిపించనున్నారు. ఈ సినిమాకు పరశురామ కృష్ణమూర్తి అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట.

ఇక ఈసినిమా రిలీజ్ డేట్ కూడా కన్ఫర్మ్ చేసింది చిత్రబృందం. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదలకానుంది.ఈ సినిమాలో రానాకు జోడిగా ఐశ్వర్యా రాజేష్ నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Related posts