ప్రస్తుతం నితిన్ వరుస సినిమాలు చేస్తూ బిజుగా ఉన్నాడు. అయితే అందులో చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్ నటిస్తున్న చిత్రం చెక్. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో నితిన్ ఖైదీగా నటిస్తున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ కీలకమైన లాయర్ పాత్రను పోషించారు. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా మొదటి లిరికల్ సాంగ్ విడుదలైంది. అయితే ఈ పాట అభిమానులను చాలా ఆకట్టుకోవడంతో పాటుగా సినిమా పై అంచనాలను కూడా పెంచేసింది. అయితే. ఉరిశిక్ష పడిన ఖైదీ నితిన్ చదరంగంతో జైలు నుంచి ఎలా బయట పడ్డాడు అనేది కథాంశంగా ట్రైలర్ బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రం ఫిబ్రవరి 26న విడుదల కానుంది. అయితే అదే వారం సందీప్ కిషన్ ‘ఎ 1 ఎక్స్ ప్రెస్’, నందిత శ్వేత ‘అక్షర’, ‘ఎ’ చిత్రాలు విడుదల కాబోతున్నట్టుగా సదరు నిర్మాతలు ప్రకటించారు. మరి వీరిలో ఎవరు ఎవరికీ చెక్ పెడతారు అనేది చూడాలి.
previous post
next post


విషపూరిత స్వభావం కలిగిన వ్యక్తిలో కదలిక… సల్మాన్ పై గాయని సంచలన వ్యాఖ్యలు