సీఎం వైఎస్ జగన్‌ని వైఎస్సార్సీపీ నేత మోషేన్‌రాజు శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. తనను ఎమ్మెల్సీగా ఎంపిక చేసినందుకు సీఎం జగన్‌కి కృతజ్ఞతలు చెప్పారు. కాగా, గవర్నర్ కోటా కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నలుగురు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో కొత్తగా లేళ్ల అప్పిరెడ్డి (గుంటూరు), ఆర్వీ రమేష్‌కుమార్ (వైఎస్సార్ కడప), మోషేన్‌రాజు (పశ్చిమ గోదావరి), తోట త్రిమూర్తులు (తూర్పు గోదావరి) ఎమ్మెల్సీలుగా మండలిలో అడుగుపెట్టనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మోషేన్‌రాజు.. వైఎస్ జగన్ పార్టీని ప్రకటించిన మరుక్షణమే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ప్రొటెం స్పీకర్‌గా విఠపు బాలసుబ్రహ్మణ్యం నియామకం ఖరారైంది. ఇందుకు సంబంధించి సీఎం వైఎస్ జగన్ ప్రతిపాదనకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ శుక్రవారం ఆమోదం చెప్పారు.
							previous post
						
						
					
							next post
						
						
					
