telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

నిన్నటితో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం…

తెలంగాణలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు నిన్నటితో ప్రచారం ముగిసింది. అయితే తెలంగాణలోని రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు రేపు ఎన్నికలు జరగబోతున్నాయి.  రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు జరుగుతాయి.  రాష్ట్రంలో మొత్తం 5,31,268 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉండగా, పురుషులు 3,36,256 మంది, మహిళలు 1,94,944 మంది, ఇతరులు 68 మంది ఉన్నారు. హైదరాబాద్ -రంగారెడ్డి-మహబూబ్ నగర్ నియోజక వర్గంలో 799 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, బరిలో 93 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇక ఇదిలా ఉంటె, ఈసారి జరగబోతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో 85శాతానికి పైగా ఓటింగ్ జరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. అయితే ఈ ఎన్నికలకు సాధారణ ఎన్నికల మాదిరిగా ప్రచారం నిర్వహించాయి పార్టీలు. నువ్వా నిన్న అనే విధంగా విమర్శలు సంధించుకున్నారు. కానీ ఈ ఎన్నికలో ప్రజలు ఎటు వైపు మొగ్గు చూపుతారు అనేది చూడాలి.

Related posts