దిశ కేసులో తాజాగా పోలీస్ ఎన్‌కౌంటర్‌పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. కాగా… సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం నిందితులు ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులును చటాన్‌పల్లికి వ్యాన్‌లో తీసుకెళ్లగా వారు పోలీసులపై రాళ్లు రువ్వి పారిపోయేందుకు యత్నించారు. దీంతో పోలీసులు కాల్పులు జరపగా నిందితులు అక్కడికక్కడే మృతి చెందారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సామాన్య ప్రజానీకం నుంచి సెలబ్రిటీలు అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దిశకు సరైన న్యాయం జరిగిందంటూ ప్రతి ఒక్కరూ వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సంఘటనపై స్పందించిన దర్శకుడు పూరి జగన్నాథ్, పోలీస్ డిపార్ట్‌మెంట్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. ఎవరికి ఏ కష్టం వచ్చినా పోలీసే ఆదుకుంటాడంటూ ట్వీట్ చేశాడు. `పోలీస్ డిపార్టుమెంటుకి చేతులెత్తి మొక్కుతున్నాను. మీరే నిజమైన హీరోలు. నేనెప్పుడు ఒక విషయాన్ని నమ్ముతాను. మనకి కస్టమొచ్చిన కన్నీళ్లొచ్చినా పోలీసోడే వస్తాడు . నువ్వే దిక్కు రక్షించాలని దేవుడికి మొక్కినా ఆ దేవుడు కూడా పంపించేది పోలీసోడినే ` అంటూ ట్వీట్ చేశాడు పూరి. దీంతో ఒక్కసారిగా నెటిజన్లు పురిపై విరుచుకు పడ్డారు. మీలాంటి వాళ్లు సినిమాలు బాధ్యాతాయుతంగా తీస్తే సమాజంలో ఇలాంటి ఘటనలు కొంతైనా తగ్గుతాయంటూ కామెంట్ చేస్తున్నారు. మీ సినిమాల్లో హీరోలు అమ్మాయిల వెంటపడుతూ ఏడిపిస్తుంటే.. బయట వాళ్ల అభిమానులు కూడా అదే పని చేస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు. అంతేకాదు ఇటీవల పూరీ కొడుకు నటిస్తున్న “రొమాంటిక్” చిత్రం పోస్టర్ ఛండాలంగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
previous post