telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘అల వైకుంఠపురములో’ అర్జున్ రెడ్డి…

ala-vikuntapuramlo

ఈ సంక్రాంతికి అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘అల వైకుంఠపురములో’ సినిమా బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. ‘జులాయి’, సన్నాఫ్ సత్యమూర్తి’ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచి వీళ్ల కాంబినేషన్‌లో హాట్రిక్ హిట్ నమోదు చేసింది. ఈ చిత్రం ఇటీవలే విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. తాజాగా ఈ సినిమాలోని ఒక డిలీట్ సీన్‌ను యూట్యూబ్‌లో రిలీజ్ చేసారు. ఈ వీడియోలో సుశాంత్‌ను ఉద్దేశిస్తూ అల్లు అర్జున్ తన అలవాట్ల గురించి చెబుతాడు. తనకు ఇటీవెల షార్ట్ ఫిల్మ్స్ షూట్ చేయడం అలవాటు అయిందన్నాడు. దాని వల్ల తనకు ఎంతో ప్రశాంతంగా ఉంటుందని అల్లు అర్జున్.. సుశాంత్‌తో చెబుతాడు. ఆ తర్వాత నిన్ననే అర్జున్ రెడ్డి 2 అనే షార్ట్ ఫిల్మ్ తీశానిని చెప్పి ఓ వీడియోను సుశాంత్‌కు చూపిస్తాడు. ఆ వీడియో చూసి సుశాంత్ షాక్ అవుతాడు. ఒకవేళ ఈ సన్నివేశాన్ని సినిమాలో పెడితే.. బాగుండేదని ఈ వీడియో చూసిన తర్వాత అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related posts