నయనతార దక్షిణాది సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్. అటు లేడి ఓరియెంటెడ్ చిత్రాలు, ఇటు గ్లామర్ రోల్స్ తో దూసుకెళ్తోంది. మరోవైపు భారీ బడ్జెట్ సినిమాల్లోనూ నటిస్తూ భారీ క్రేజ్ ను మూటగట్టుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. దక్షిణాదిన అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ల జాబితాలో అగ్రస్థానంలో ఉంది. అయితే నయనతార కొద్ది కాలంగా తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమాయణం సాగిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఇప్పటివరకు తమ బంధంపై బహిరంగంగా స్పందించలేదు. అయితే సోషల్ మీడియా ద్వారా మాత్రం ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను ఎప్పటికప్పుడు వెల్లడిస్తుంటారు. ఇక లాక్‌డౌన్ కారణంగా చాలాకాలం ఇంటికే పరిమితమైన లేడీ సూపర్‌స్టార్ నయనతార ప్రస్తుతం వరుస టూర్లతో బిజీగా ఉంది. ఇటీవలె ఓనం పండుగ కోసం ప్రియుడు, డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో కలిసి కొచ్చి వెళ్లిన నయన్.. ప్రస్తుతం గోవాలో సేదతీరుతోంది. విఘ్నేష్, నయన్ తరచుగా విదేశీ యాత్రలకు వెళుతుంటారు. అయితే ఆరు నెలలుగా తప్పనిసరి పరిస్థితుల్లో చెన్నైలోనే ఉండిపోయారు. ప్రస్తుతం ప్రభుత్వం నుంచి అనుమతులు లభించడంతో తనకు ఎంతో ఇష్టమైన గోవాలో ప్రియుడితో కలిసి నయన్ ఎంజాయ్ చేస్తోంది. నయన్ అక్కడ సేదతీరుతున్న ఫొటోలను విఘ్నేష్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. “తప్పనిసరి సెలవుల తర్వాత వెకేషన్ కోసం బయటకు వచ్చాం” అంటూ విఘ్నేష్ కామెంట్ చేశాడు.
previous post
సీత” కోసం నాన్న మాట కాదన్నా : బెల్లంకొండ శ్రీనివాస్