telugu navyamedia
సినిమా వార్తలు

నయన్​-విఘ్నేశ్​ వెడ్డింగ్​ ఇన్విటేషన్​ వీడియో వైరల్​..

లేడీ సూప‌ర్ స్టార్ నయనతార-విఘ్నేశ్​ శివన్​ మరికొన్ని గంటల్లో మూడుముళ్ల బంధంతో ఏడడుగులతో వీళ్లిద్దరు ఒకటి కానున్నారు. న‌య‌న్‌, విఘ్నేష్ వివాహం హిందూ సంప్ర‌దాయంలో మహాబలిపురంలో జూన్ 9న జ‌ర‌గ‌నుంది. వేదిక కానుంది. అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుక జరగనుంది.

Nayanthara and Vignesh Shivan to skip honeymoon after grand wedding? -  Movies News

అయితే తాజాగా నయన్​-విఘ్నేశ్​ వెడ్డింగ్​ ఇన్విటేషన్​ వీడియో నెట్టింట వైరల్​గా మారింది. ఈ యానిమేటేడ్ వీడియోలో వధువు, వరుడు తమిళ సాంప్రదాయ దుస్తులు ధరించి కలిసి నడుస్తున్నట్లుగా చూపించారు. ఇందులో నయనతార, విఘ్నేష్​ తల్లిదండ్రుల పేర్లు, పెళ్లి తేది, జరిగే సమయం, వేదికను వివరాలున్నాయి.

Nayanthara Vignesh's love story

కాగా..వీళ్ల పెళ్లికి ఇరు కుటుంబాలకు చెందిన ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు సినీ పరిశ్రమకు చెందిన కొంత మందికి మాత్రమే ఆహ్వానం ఇప్పటికే అందినట్టు సమాచారం. ​ఈ వేడుకకు వచ్చే అతిథులందరూ ప్రత్యేక డ్రెస్ కోడ్​లో హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

ఈ వేడుకకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో పాటు కొంతమంది తమిళనాడు రాజకీయ నాయకులు హాజరు కానున్నట్టు సమాచారం. ఇక తెలుగు సినీ పరిశ్రమ నుంచి బాలయ్య, చిరంజీవి, సమంతలకు ప్రత్యేక ఆహ్వానం అందినట్టు సమాచారం. అంతేకాకుండా సాంప్ర‌దాయ దుస్తుల్లో వివాహానికి హాజ‌రుకావాల‌ని ఆ పత్రిక‌లో రాసి ఉంది.

Nayanthara and Vignesh Shivan's new photo is going viral. See it here -  Movies News

Related posts