ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అంతేకాకుండా.. మోహన్ భగవత్ తో ఉన్న సాన్నిహిత్యం ఆయన చేసిన సేవలు, స్ఫూర్తిదాయక వ్యక్తిత్వం గురించి ప్రధాని మోదీ అనేక విషయాలను పంచుకున్నారు.
“వసుధైవ కుటుంబకం సూత్రంతో ప్రేరణ పొంది శ్రీ మోహన్ భగవత్ జీ తన జీవితాంతం సామాజిక పరివర్తనకు, సామరస్యం – సోదరభావ స్ఫూర్తిని బలోపేతం చేయడానికి తన జీవితాన్ని అంకితం చేశారు..”
అంటూ మోదీ పేర్కొన్నారు. తన 75వ పుట్టినరోజు ప్రత్యేక సందర్భంగా, మా భారతి సేవలో మోహన్ జీ అంటూ ఆయన స్ఫూర్తిదాయక వ్యక్తిత్వం గురించి అనేక విషయాలను ప్రధాని మోదీ వ్యాసంలో పంచుకున్నారు.