రేపు రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్లు స్విచ్ఛాఫ్ చేసి, కొవ్వొత్తులు, దీపాలు వెలిగించి కరోనాపై పోరాడుతున్న దేశ స్ఫూర్తిని చాటాలంటూ ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. మోదీ పిలుపుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు ఆమె మీడియాతో మాట్లాడుతూ… ‘ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన మనసులో ఏముందో ఆయన చెబుతారు. నా మనసులో ఏముందో నేను చెబుతాను. ఇతరుల విషయాల్లో నేను జోక్యం చేసుకోను. ప్రధాని మంచి విషయం చెప్పారని అనుకుంటే మీరు అనుసరించండని అన్నారు.
‘ఆదివారం రాత్రి 9 గంటలకు నాకు నిద్రొస్తే నేను నిద్రపోతాను. మోదీ మీకు చెప్పాడు.. మీరు చెయ్యండి. నన్నెందుకు దాని గురించి అడుగుతారు. నేనేం చేయగలనో నేను చెబుతాను. మోదీ ఏం చేయగలరో ఆయన చెబుతారు. కరోనా వైరస్‌ను అడ్డుకోమంటారా లేక రాజకీయాలు చేయమంటారా? దయచేసి రాజకీయ పోరుకు ఆజ్యం పోయొద్దు’ అని చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటికే కరోనా వల్ల కోట్లాది రూపాయల నష్టం వచ్చిందని ఆమె తెలిపారు.
సచివాలయం కూల్చివేత కోర్టు ధిక్కరణే: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి