వ్యాన్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ పెనుప్రమాదం నుంచి విద్యార్థులు బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే నారాయణపేట జిల్లాలోని నర్వ మండలం కుమార్లింగంపల్లి గ్రామం నుంచి ఆత్మకూర్‌కు బయల్దేరిన వ్యాన్‌లో ఏడుగురు విద్యార్థులు, మరో ముగ్గురు ప్రయాణికులు ఎక్కారు.
వ్యాన్ బయల్దేరిన కాసేపటికే మార్గమధ్యలో ఇంజిన్‌లో నుంచి ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్.. వ్యాన్‌ను ఆపి విద్యార్థులను, ముగ్గురు ప్రయాణికులను ప్రాణాలతో కాపాడారు. అగ్నిప్రమాదం కారణంగా వ్యాన్ పూర్తిగా దగ్ధమైంది. పెనుప్రమాదం నుంచి బయటపడడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు.
చంద్రబాబు నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలు: సీఎం జగన్