నందమూరి వీరాభిమాని పోతుగంటి పీరయ్య పాడిమోసిన నందమూరి రామకృష్ణ. నంమూరి అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మా కుటుంబసభ్యులు. పీరయ్య మా కుటుంబసభ్యుడు, మాకు ఆప్తుడు అని రామకృష్ణ అన్నారు.
పీరయ్య మృతదేహాన్ని చూసి కన్నీటిపర్యంతమైన నందమూరి రామకృష్ణ.
మా కుటుంబంలోని ఒక వ్యక్తిని కోల్పోవడం తెలుగుదేశం పార్టీకి తీరని లోటు నందమూరి తారక రామారావు గారి వీరాభిమానిగా కడప జిల్లా నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షుడిగా, తెలుగుదేశం పార్టీ వీరాభిమానిగా ఉన్న పీరయ్య మరణం నన్ను కలిచివేసింది అన్నారు.
వైసీపీ దురాగతాలకు ఎదురొడ్డి రూ.3 వేల కోట్ల పెండింగ్ ఉపాధి హామీ నిధులను సాధించడంలో పీరయ్య పాత్ర కీలకం అని రామకృష్ణ అన్నారు.
పార్టీ కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం, ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అని నందమూరి రామకృష్ణ అన్నారు.
పోతుగంటి పీరయ్య అంత్యక్రియలకు రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి హాజరై నారు.
నేను ముందే పార్టీకి రాజీనామా చేశా..నన్ను సస్పెండ్ చేయడమేంటి?