గుంటూరు జిల్లాకు చెందిన మెగా అభిమాని రాజనాల నాగలక్ష్మికు స్టార్ హాస్పిటల్‌లో మేజర్ సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి ఆమెకు ఎంతగానో సహకారం అందించారు. కాగా సోమవారం రాజనాల నాగలక్ష్మి గారిని స్టార్ హాస్పిటల్స్ వారు ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి తరలించారు. ఈ సందర్భంగా డాక్టర్లు ఆమె ఆరోగ్యం బాగుందని తెలిపారు. అలాగే రాజనాల నాగలక్ష్మి స్పృహలోకి రాగానే చిరంజీవి శ్రీమతి సురేఖ స్వయంగా వీడియో కాల్ ద్వారా ఆమె ఆరోగ్య పరిస్థితి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మీకు మేమున్నామంటూ ధైర్యం చెప్పారు. అనంతరం నాగలక్ష్మి మాట్లాడుతూ: ‘ఇది కలా..నిజమా? నా నడిచే దైవం శ్రీ చిరంజీవి గారు స్వయంగా నాతో మాట్లాడటమా? దీన్ని ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. శ్రీమతి సురేఖ గారు కూడా కుంటుంబ సభ్యురాలిగా నాతో ఎంతో ప్రేమతో ఆప్యాయంగా మాట్లాడారు. ఈ జన్మకిది చాలు. ముక్కోటి దేవతలు చిరంజీవి గారిని..వారి కుటుంబాన్ని చల్లగా చూడాలని, మనస్ఫూర్తిగా ప్రార్ధిస్తున్నాన’ని ఉద్వేగంతో మెగా దంపతుల పరామర్శకి బదులిచ్చారామె.


మా ఇంట్లో పెళ్లి.. పబ్లిక్ పండుగ కాదు… నిహారిక పెళ్ళిపై నాగబాబు కామెంట్స్