రచయిత , సీనియర్ జర్నలిస్ట్ , చారిత్రిక పరోశోధకుడు భగీరథ రచించిన ‘నాగలాదేవి ‘ నవలను కన్నడంలోకి అనువదిస్తానని వీరశైవ కళాశాల తెలుగు అధ్యాపకులు ప్రొఫెసర్ డాక్టర్ ఆర్ .దేవన్న ప్రకటించారు .
శ్రీకృష్ణదేవరాయల అపురూప ప్రేమకథను భగీరథ నాగలాదేవి పేరుతో రచించిన గ్రంథాన్ని బళ్లారిలో రాఘవ కళామందిర్ లో తెలుగు సంస్కృతీ సమితి , బలిజ సంఘం సంయుక్తంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కర్ణాటక రాష్ట్ర మాజీ శాసన సభ్యులు నారా సూర్యనారాయణ రెడ్డి ఆవిష్కరించారు .
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రొఫెసెర్ దేవన్న మాట్లాడుడూ మధ్యయుగాల నాడు శ్రీకృష్ణదేవరాయలు హిందూ జాతికోసం అలుపెరుగని పోరాటం చేసిన మహా యోధుడని , ఆయన మాట తప్పని , మడమ తిప్పని పాలకుడని , నాగలాదేవి అనే వేశ్య కుటుంబంలో జన్మించిన అమ్మాయిని ప్రేమించి పెళ్లిచేసుకున్న ఆదర్శప్రాయుడని దేవన్న కొనియాడారు .
అలాంటి కృష్ణదేవరాయలు , నాగలాదేవి మధ్య వున్న సున్నితమైన ప్రేమ కథను రచయిత భగీరథ పరిశోధన చేసి రచించిన అద్భుతమైన కావ్యం నాగలాదేవి అని చెప్పారు .
నాగలాదేవి తెలుగు పుస్తకాన్ని తానూ కన్నడంలోకి అనువదిస్తామని సభా ముఖంగా ప్రకటిచారు.
సభకు అధ్యక్షత వహించిన నవ్యాన్ద్ర రచయితల సంఘం అధ్యక్షులు బిక్కి కృష్ణ మాట్లాడుతూ రచయిత భగీరథ పదిహేను సంవత్సరాపాటు పరిశోధన చేసి రూపొందించిన అద్భుతమైన ప్రేమ కావ్యం నాగలాదేవి అని, ఈ పుస్తకాన్ని బళ్లారిలో ఇంతమంది సాహితీవేత్తల సమక్షంలో ఆవిష్కరింపచేయడం ఆనందంగా ఉందని చెప్పారు .
డాక్టర్ బీరం సుందర్ రావు మాట్లాడుతూ భగీరథ గారు రచించిన నాగలాదేవి చారిత్రిక నవలల్లో అత్యుత్తమమైనది , ఈ దశాబ్దంలో నేను చదివిన గొప్పనవలని చెప్పారు .
నాగలాదేవి నవలను దేవాంన్నగారు కన్నడంలోకి అనువదిస్తామని చెప్పడం చాలా సంతోషాన్ని కలిగించిందని అన్నారు .
సభలో డాక్టర్ జెల్ది విద్యాధర్ , న్యాయవాది రాఘవ కళామందిర్ అధ్యక్షులు కె . కోటేశ్వర రావు , డాక్టర్ గాదెమ్ గోపాలకృష్ణ , ఎస్. మురళీకృష్ణ , అమరేంద్రనాథ్ చౌదరి , జి . ప్రభాకర్ , కె .రమేష్ బుజ్జి తదితరులు మాట్లాడారు.
రచయిత భగీరథ మాట్లాడుతూ 2007లో జగపతిబాబు , భూమిక , అనుష్క సినిమాకు తాను ప్రొజెక్టర్ గా పనిచేసినప్పుడు , ఆ సినిమాలో ఒక పాటను హంపి లో చిత్రీకరించాలని , అప్పుడు మొదటిసారి హంపిని సందర్శించాన్ని చెప్పారు .
అప్పుడు శిథిలమైన హంపి మహానగరాన్ని చూసి చలించిపోయి పరిశోధన చేయడం మొదలు పెట్టానని చెప్పారు.
కాకతీయ , విజయనగర సామ్రాజ్యాల మీద తన పరిశోధన సాగిందని , కృష్ణదేవరాల రెండవ భార్య నాగలాదేవి ప్రేమ కథ తనని బాగా ఆకట్టుకొంది అందుకే ఆమె మీద 15 సంవత్సరాల పాటు ఢిల్లీ , ముంబై , చెన్నై , గోవా , మైసూర్ , హంపి , వరంగల్ తదితర ప్రాంతాల్లో పర్యటించి పరిశోధన చేశానని భగీరథ తెలిపారు .
నాగలాదేవి నవలకు వస్తున్న స్పందన చూసిన తరువాత తన కష్టాన్ని మర్చిపోయానని , బళ్లారిలో 18 సంవత్సరాల తరువాత ఈ నవల ఆవిష్కరణ జరగడం యాదృచ్చికమైనా , ఎంతో అనుభూతిని కలిగించిందని భగీరథ చెప్పారు .
ఈ సందర్శముగా డాక్టర్ ఆర్ . దేవన్నకు భగీరథ కృతజ్ఞతలు తెలిపారు .
జగన్ రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చేశారు..