నాగ చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ చేస్తున్నాడు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే చాలా వరకు లవ్ స్టోరీ షూటింగ్ జరపుకుంది. కారోనా వల్ల ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ‘లవ్ స్టోరీ’ తర్వాత మరో రెండు సినిమాలకు ప్లాన్ చేశాడు చైతూ అందులో భాగంగా ఆయన ‘బంగార్రాజు’ ‘నాగేశ్వరరావ్’ సినిమాల్లో నటించనున్నాడు. ఈ రెండు సినిమాలతో పాటు మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ‘దిల్’ రాజు నిర్మించనున్న ఈ సినిమాకి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించనున్నాడు. విక్రమ్ కుమార్ ఇటీవల నానితో ‘గ్యాంగ్ లీడర్’ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అంతేకాదు గతంలో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చైతూ ‘మనం’ సినిమా చేశాడు. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత విక్రమ్ దర్శకత్వంలో చైతన్య సోదరుడు అఖిల్ ‘హలో’ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా అలరించలేకపోయింది. అయితే ఈ ఇద్దరీ కాంబినేషన్‌లో వచ్చే ఈ తాజా చిత్రానికి ‘థ్యాంక్యూ’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది.