telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

గొల్లపూడి మారుతిరావుకు ప్రముఖుల సంతాపం

Gollapudi

ప్రముఖ నటుడు, రచయిత, విలక్షణ నటుడు, ప్రతి నాయకుడు, రచయిత, కవి, జర్నలిస్టు, ప్రసంగీకుడు గొల్ల‌పూడి మారుతీరావు ఈ రోజు మ‌ధ్యాహ్నాం క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. గ‌త కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ‌పుడుతున్న ఆయ‌న ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గొల్లపూడి మారుతీరావు మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు సినిమా రంగానికి ఆయన చేసిన సేవలను ముఖ్యమంత్రి కొనియాడారు. తెలుగు సాహిత్యంపై ఆయన వ్రాసిన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు తెలుగు భాషాభివృద్ధికి దిశానిర్దేశనం చేసాయని ముఖ్యమంత్రి అన్నారు. మారుతీరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సీనియర్ నటుడు శ్రీ గొల్లపూడి మారుతీ రావు మృతి పట్ల సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. , రచయిత, వ్యాఖ్యాత గా కూడా గొల్లపూడి మారుతీ రావు రాణించారని గుర్తు చేశారు. సుమారు 250 కి పైగా చిత్రాలలో నటించిన ఆయన 6 నంది అవార్డులు అందుకున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి గా ఎంతో గుర్తింపు పొందారు. ఈయన మృతి తో చిత్ర పరిశ్రమ ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

బ‌హుముఖ ప్రజ్ఞాశాలి గొల్ల‌పూడి మారుతీ రావు మృతి ప‌ట్ల ఏపీ సీఎం జ‌గ‌న్ సంతాపం వ్య‌క్తం చేశారు. సినీ ప‌రిశ్ర‌మ మంచి వ్య‌క్తిని కోల్పోయింది. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కి ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాను అని జ‌గ‌న్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు కూడా గొల్ల‌పూడి మృతికి నివాళులు అర్పించారు. మంచి న‌టుడు, ర‌చ‌యిత‌ని కోల్పోయాం అని ఆయ‌న అన్నారు.

గొల్ల‌పూడి మృతి ప‌ట్ల సినీ ప‌రిశ్ర‌మ‌కి సంబంధించిన ప‌లువురు ప్ర‌ముఖులు నివాళులు అర్పిస్తున్నారు. హీరో నాని త‌న ట్విట్ట‌ర్‌లో .. ఇష్ట‌మైన న‌టుల‌లో గొల్ల‌పూడి ఒక‌రు. ఆయ‌న మాట్లాడే తీరు, న‌ట‌న ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుది. ఆయ‌న సాహిత్యం చాలా గొప్ప‌ది. ఒక ఫ్యామిలీలా ఉండే మిమ్మ‌ల్ని మేము ఎప్ప‌టికి గుర్తు పెట్టాం అని నాని పేర్కొన్నారు.

ఇక‌ హీరో నిఖిల్‌ సిద్ధార్థ్ త‌న ట్విట్ట‌ర్‌లో స్పందిస్తూ హ్యాపీడేస్‌ సినిమాకు ముందు ఒక చిన్న సినిమాలో ఆయనతో కలిసి నటుడు కమ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాను. ఆ సందర్భంగా ఆయన మార్గదర్శకత్వం, సలహాలు ఎప్పటికీ తనతోనే శాశ్వతంగా ఉంటాయంటూ గొల్లపూడిని గుర్తు చేసుకున్నారు. అద్భుతమైన సినిమాలు, నటనతో ఆయన మన గుండెల్లో ఎప్పటికీ నిలిచే ఉంటారని, ఆయన ఆత్మకు శాంతి కలగాలంటూ ప్రార్ధించాడు నిఖిల్.

సినీ ప‌రిశ్రమ గొప్ప వ్య‌క్తిని కోల్పోయింది. నాకు న‌చ్చిన న‌టుల‌లో ఈయ‌న ఒకరు. న‌టుడు, ర‌చ‌యిత‌గా ఎంతగానో రాణించారు. మిమ్మ‌ల్ని మేము ఎంత‌గానో మిస్ అవుతున్నాం అని అల్లరి న‌రేష్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు

ఇక ఆయ‌న అంత్య‌క్రియ‌లు ఆదివారం ఉద‌యం 11.30ని.ల‌కి చెన్నైలో జ‌ర‌ప‌నున్నారు. అభిమానుల సంద‌ర్శ‌నార్ధం శ‌నివారం భౌతిక దేహాన్ని స్వ‌గృహానికి త‌ర‌లించ‌నున్నారు. గొల్ల‌పూడి మృతితో ఆయ‌న కుటుంబం శోక సంద్రంలో మునిగింది. ఆదివారం గొల్లపూడి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కుటుంబీకులు, బంధువులు విదేశాల నుంచి వచ్చే వరకు ఆసుపత్రిలోనే మృతదేహాన్ని ఉంచనున్నారు. గొల్ల‌పూడికి ముగ్గురు కుమారులు ఉండ‌గా, ఓ కుమారుడు రోడ్ యాక్సిడెంట్‌లో మృతి చెంద‌డంతో చాలా కుంగిపోయారు. దివంగత కుమారుడు గొల్లపూడి శ్రీనివాస్ పేరుమీద,…. గొల్లపూడి శ్రీనివాస్ మెమోరియల్ ఫౌండేషన్ ప్రతి ఏట ఆగష్టు 12 న ,ఉత్తమ ప్రతిభను కనపరిచిన డెబ్యూ డైరెక్టర్ కి గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ అవార్డును ప్రదానం చేస్తుంది.

Related posts