హైదరాబాద్ టూ బెంగళూరుకు వెళ్తోన్న కావేరీ ట్రావెల్స్ బస్సు చిన్నటేకూరులో బైకును ఢీకొనడంతో మంటలు చెలరేగాయి.
ప్రమాదం సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉండగా, అందులో 20 మంది చనిపోయినట్లు సమాచారం. ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది.
బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మృతులకు కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా, క్షతగాత్రులకు రూ. 50వేల చొప్పున పరిహారం ప్రకటించారు.

