మరో నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు అండమాన్ తీరాన్ని తాకుతాయని వాతావరణ శాఖ తెలిపింది.
మరోవైపు ద్రోణి ప్రభావంతో నాలుగు రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్ లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇవాళ ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి మరియు కృష్ణా జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మంగళ, బుధవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశంఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రానికి దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి బలమైన గాలులు వీస్తాయని వెల్లడించింది.
ఏపీలో పలు జిల్లాలకు రేపు వర్ష సూచన ఉన్నట్లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ ఎండీ కూర్మనాథ్ తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
రాయలసీమ జిల్లాల్లోని పలుచోట్ల తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందన్నారు.


టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోంది: లక్ష్మణ్