బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ… టిఆర్ఎస్ పార్టీ ఓట్లర్లకు వార్నింగ్ ఇస్తుంది.. బీజేపీ టి ఆర్ ఎస్ కు వార్నింగ్ ఇస్తుందని ఆయన అన్నారు. బండి సంజయ్ బాష మార్చుకో అని కేటీఆర్ అంటున్నారు కచ్చితంగా మార్చుకుంటా యూ ట్యూబ్ లో మీ నాన్న కేసీఆర్ ఏం మాట్లాడిండో చూస్తా, అంతకంటే ఎక్కవగా నేను మాట్లాడుతానని అన్నారు. నశం పెట్టి కొడుతాను అని కేసీఆర్ అన్నారు…నశంలో జెండుబాం పెట్టి మేము కొడుతామని అన్నారు. లక్ష నాగళ్లతో దున్నుతాను అన్న కేసీఆర్ ఎక్కడికి పోయారు ? అందరి చిట్టా మా ముందు ఉంది అందరి సంగతి చూస్తామని అన్నారు. కార్పొరేట్ స్కూల్ లో వేల వేల ఫీజులు వసూలు చేస్తున్నారు… పని చేసే టీచర్స్ కు ఎందుకు జీతాలు ఇవ్వడం లేదు ? ప్రైవేట్ టీచర్స్ ఆత్మహత్యలు చేసుకున్నారు అని అన్నారు. కార్పొరేట్ స్కూల్స్ లో కేసీఆర్ కుటుంబ సభ్యులకు,టి ఆర్ ఎస్ నేతలకు వాటాలు ఉన్నాయేమో అన్నారు. చల్ల ధర్మారెడ్డి అనుచరులు బీజేపీ కార్యకర్తల పైన,కార్యాలయం పైన దాడి చేసిన కేస్ పెట్టలేదని, అదే బీజేపీ కార్యకర్తల మీద అక్రమ కేస్ లు పెట్టి జైల్ కు పంపించాని అన్నారు. కేసీఆర్ కు తెలంగాణ ను పాలించే అర్హత లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి నోటి నుండి హిందువు అనే పదం రావడానికి బీజేపీ నే కారణం అని ఆయన అన్నారు.
previous post