telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మెగాస్టార్ తీసిన అద్భుతమైన ఫోటోలు… వైరల్

Chiru

మెగాస్టార్ చిరంజీవి తాజాగా షేర్ చేసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తన ఇంట్లో అందంగా విరబూసిన మందారాన్ని అలాగే కెమెరాలో బంధించారు చిరంజీవి. “ప్రభాత సౌందర్యాన్ని వొడిసి పట్టుకుని, మా ఇంటి మందారం తన కొప్పుని సింగారించింది. అలవోకగా నా కెమెరా కంటికి చిక్కి అంతర్జాలానికి తన అందం తెలిసింది!” అంటూ ఫొటోను తన ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ తన భావాలను అందంగా వ్యక్తం చేశారు చిరంజీవి. ఇక చిరంజీవి సినిమాల విషయానికొస్తే… కాస్త గ్యాప్ తీసుకొని తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివతో ‘ఆచార్య’ మూవీ చేస్తున్నారు. ‘ఆచార్య’ ఇంకా సెట్స్ పైన ఉండగానే మరికొన్ని ప్రాజక్టులను కూడా లైన్లో పెట్టారు. వీటిలో రెండు సినిమాలకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు స్పీడుగా జరుగుతున్నాయి. మలయాళంలో హిట్టయిన ‘లూసిఫర్’ సినిమా, మరొకటి తమిళంలో వచ్చిన ‘వేదాళం’.

Related posts