మెగాస్టార్ చిరంజీవి తాజాగా ‘అమ్మ కోసం అమ్మ నేర్పిన వంట’ అంటూ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ‘చింత తొక్కుతో చిన్న చేపల గుజ్జు ఏపుడు…’ చేశానంటూ చిరు వంటలోని తన నైపుణ్యాన్ని చూపించారు. ఇక కొరటాల శివ – మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. మెగా సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. మెగాస్టార్ ఈ చిత్రం కోసం బరువు తగ్గడంతో పాటు లుక్ కూడా చేంజ్ చేశారు. యంగ్ గా కనిపించడానికి చాలా మేక్ ఓవర్ కూడా అయ్యారు. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ సరసన చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ చరణ్ మాజీ నక్సలైట్ గా కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో రెజీనా ఓ సాంగ్ లో కనిపించనుంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.