ఎడబాటైనా, తడబాటైనా
      మన్నించు…నీ ప్రేమతో
      విరహమైనా, కలహమైనా
      మన్నించు…నీ లాలనతో
      ద్వేషమైనా, దూషణైనా
      మన్నించు…నీ పలుకుతో
      కోపమైనా, తాపమైనా
      మన్నించు…నీ స్పర్ళతో
      ఎందుకంటే మన మద్య
      ఇవన్నీ తాత్కాలికం
      బంధం ఒక్కటే శాశ్వతం..
-కయ్యూరు బాలసుబ్రమణ్యం, శ్రీకాళహస్తి

