సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి తరువాత జరుగుతున్న పరిణామాలు బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సీబీఐ రంగంలోకి దిగింది. సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి విచారిస్తూ కూపీ లాగుతున్నారు సీబీఐ అధికారులు. ఈ పరిస్థితుల్లో ఇటు సుశాంత్‌కి, అటు రియా చక్రవర్తికి న్యాయం జరగాలంటూ మంచు లక్ష్మి పెట్టిన పోస్ట్ వివాదాస్పదంగా మారింది. ”సుశాంత్ సూసైడ్ కేసులో నిజానిజాలేంటో తనకు తెలియదు. అయితే వాటిని తెలుసుకోవాలనుకుంటున్నా. సుశాంత్‌కు న్యాయం చేయాలని సీబీఐ సహా అన్ని రకాల ఏజెన్సీలు, అధికారులు కష్టపడుతున్న తీరు హర్షనీయం. కాకపోతే నిజానిజాలు బయటకురాకుండానే ఒకరిని నిందించడం, వేరొకరి ఫ్యామిలీని కించపరిచే వ్యాఖ్యలు చేయడం సరికాదనేది నా అభిప్రాయం. మీడియా కథనాలు చూసి రియా కుటుంబం పడే ఆవేదన ఎలా ఉంటుందో నాకు తెలుసు. జీవితంలో ఇలాంటి సందర్భాల్లోనే సహచరులు అండగా నిలబడాలి. రియా విషయంలో ఇది సరైన పద్దతి కాదు. అసలు విషయం బయటకొచ్చే దాకా ఆమెను నిందించడం ఆపండి” అని మంచు లక్ష్మి పేర్కొంది. అయితే లక్ష్మి మాటలకు తాప్సి లాంటి కొందరు సెలబ్రిటీలు మద్దతిస్తుండగా.. కొంతమంది సుశాంత్ ఫ్యాన్స్ మాత్రం తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.
@sardesairajdeep @Tweet2Rhea @itsSSR . Wake up my industry friends… stop this lynching. #letthetruthprevail pic.twitter.com/5SCEX8Un8H
— Lakshmi Manchu (@LakshmiManchu) August 30, 2020
మంచు లక్ష్మి పోస్ట్ కు హీరోయిన్ తాప్సీ రిప్లై ఇచ్చారు. “నాకు వ్యక్తిగతంగా సుశాంత్ పెద్దగా పరిచయం లేదు, రియా కూడా అంతగా తెలీదు. తెలిసిందల్లా ఒక్కటే.. నేరం నిరూణ అవకముందే ఓ వ్యక్తిని దోషిగా చూపే ప్రయత్నం చేయడం తప్పు. చట్టాన్ని ప్రతి ఒక్కరూ విశ్వసించండి” అని ట్వీట్ చేశారు.