telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

టాలీవుడ్ లో డ్రగ్స్ లేకుండా పార్టీలే జరగవు… మాధవీలత సంచలన వ్యాఖ్యలు

Madhavilatha

టాలీవుడ్ ఇండస్ట్రీపై నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు ఆమె ఫేస్ బుక్ ఖాతాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
“NCB సుశాంత్ కేసు లో అడుగు పెట్టడం మంచిదే.
బాలీవుడ్ లో డ్రగ్స్ వాడకం బాగా ఉంది అన్నది నిజం.
కానీ ఇదిగో అదిగో అని ఫైనల్ గా తుస్సుమనిపిస్తారేమో అని నాకు డౌట్
ఎందుకంటే అంత బడా బాబులే కదా
అందులోను సినిమా రంగం ఇప్పటికే చెడ్డ పేరు అంటగట్టుకుంది
కానీ డ్రగ్స్ నేరం
ఒక పేదవాడికి అన్నం పెడతారో లేదో డ్రగ్స్ కి
1 ప్యాకెట్ అంటారా గ్రాములు అంటారా?
ఏదో దానికి వేలు పెడతారు సరే అది వాళ్ళ ఇష్టం
ఇండియాలో పర్మిషన్ ఉన్నవి తినండి తాగండి
దేశానికి ఆదాయం పెంచుకుంటే పెంచుకోండి కానీ
ఇతర దేశాల మారక ద్యవ్యాలు ఎందుకు
ఆ మత్తులో జరిగే అరాచకాలు ఎవరూ బయట పెట్టరు
అది సరే కానీ
తెలంగాణ NCB సార్లు మన టాలీవుడ్ మీద కూడా ఒక కన్నేయండి
పీతకన్నూ కాకుండా సీరియస్ కన్ను వేయండి
మన ఇండస్ట్రీలో బాగా వాడుకలో ఉంది
అది లేకుండా కొన్ని పార్టీలు జరగవు ఇక్కడ
2009లో వచ్చారు పొలిటికల్ అండతో వెనక్కి పోయారు
పాపం డీల్ చేసిన ఆఫీసర్ నోరు నొక్కేసి
Other Department కి పడేసారు
చట్టానికి చేతులు చాల పెద్దవి అందుకే అవి చాచితే విరగొడతారు
చాల దారుణాలు జరుగుతున్నాయి మత్తులో
1. సినిమా వాళ్ళు
2.పబ్స్
3. స్టూడెంట్స్
బాగా వాడుతూ మాదక ద్యవ్యాల వారికీ బాగా ఆదాయాన్ని పెంచుతున్నారు
కాస్త చూసి అదుపులో పెట్టండి ….
Disclaimer :-
అమ్మో నాకు భయం గా ఉంది ఈ పోస్ట్ పెట్టాను అని నన్ను ఎవరైనా బెదిరిస్తారేమో అని… ఎవరు డ్రగ్స్ జోలికి పోరు… ఆ అధికారులు కూడా చూసి చూడనట్లే ఉంటారు నిజంగా పట్టుకుంటే వాళ్ళకి భయం. ఒకవేళ పట్టుకున్న ప్రభుత్వాలు ఎలాగూ వదిలేయి అని భయపెడతాయి కదా ఆఫీసర్స్ ని . సరేలే నాకేమన్నా అయితే చట్టం చేతకానితనం అని నేనే కేసు పెట్టాల్సి వస్తది ఏమో ….!” అంటూ పోస్ట్ చేశారు.

Related posts