telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అనసూయ హార్ట్ పై టాటూ… అర్థం ఇదే

Anasuya

ఒకవైపు బుల్లితెరపై తనదైన శైలిలో యాంకర్ గా… మరోవైపు వెండితెరపై ప్రత్యేకమైన పాత్రల్లో నటిస్తూ యూత్ లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంది అనసూయ. సోషల్ మీడియాలో ఎప్పుడూ అప్డేట్ గా ఉండే అనసూయ తాజాగా కొత్త సంవత్సరం సందర్భంగా ట్విట్టర్ ద్వారా “ఆస్క్ అనసూయ” అంటూ తన అభిమానులతో ముచ్చటించారు. ఈ క్రమంలోనే అనసూయకు ఓ నెటిజన్ నుంచి మీ హార్ట్ పై ఉన్న టాటూకు అర్థం ఏంటి ? అనే ప్రశ్న ఎదురైంది. “అక్కడ నిక్కు అని ఉందని, అది తన భర్త ముద్దు పేరని తెలిపింది అనసూయ. ఇక మరో నెటిజన్ “మీ మొదటి పారితోషికం ఎంత?” అని ప్రశ్నించాడు. తమ మొదటి పారితోషికం 5,500 రూపాయలని చెప్పింది అనసూయ.

వైఎస్సార్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న “యాత్ర”లో మీ పాత్ర ఎలా ఉంటుంది ? అనే ప్రశ్నకు… ఇప్పుడు నేను ఆ విషయాన్నీ చెప్పలేను. కానీ ఆ పాత్ర కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోతుందని చెప్పింది. అలాగే అభిమానులు అడిగిన మరికొన్ని ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు చెప్పుకొచ్చింది. “రంగస్థలం”తో మంచి గుర్తింపును సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

Related posts