సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం సర్కారు వారి పాట. పరుశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సమ్మర్ లో రిలీజ్ కానుంది.

ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన కళావతి ఫస్ట్ సింగిల్ రికార్డు సృష్టించింది. తాజాగా మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానులకు అదిరిపోయే కానుకను అదించింది సర్కారువారి పాట చిత్ర యూనిట్.
![అదిరిపోయే టైటిల్ పట్టాడు.. సినిమా కూడా అలాగే ఉంటుందంటూ పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. బ్యాంకింగ్ సెక్టర్లో ఆర్థిక నేరాల చుట్టూ కథ అల్లుకున్నారు ఈ దర్శకుడు. ఇందులో తన తండ్రిపై మోపబడిన దొంగతనం కేసును కొడుకు ఎలా తుడిచేస్తాడు.. ఆ నేరం చేసిన వాన్ని ప్రభుత్వానికి ఎలా పట్టిస్తాడు అనేది కథ అని తెలుస్తుంది. మహేష్ బాబు ఈ సినిమా కోసం తనను తాను గెటప్ పరంగానూ చాలా మార్చుకున్నారు.,[object Object]](https://images.news18.com/telugu/uploads/2022/02/sarkaru-vaari-paata.jpg)
ఈ చిత్రం నుంచి కొత్త పోస్టర్ని విడుదల చేసింది. ఈ పోస్టర్లో మహేశ్ బాబు రౌడీలను కొడుతుంటే.. వాళ్లు గాల్లో ఎగిరిపడుతున్నారు. ఈ పోస్టర్ చూసి పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. .ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది.
![అభిమానులు కూడా దానికే అలవాటు పడిపోయారు. అలాంటిది సరిలేరు నీకెవ్వరు సినిమాలో చాలా ఏళ్ళ తర్వాత మహేష్ బాబుతో అదిరిపోయే డాన్సులు చేయించారు కొరియోగ్రఫర్ శేఖర్. దర్శకుడు అనిల్ రావిపూడి పట్టుబట్టి మరీ మహేష్ బాబుతో లుంగీ డాన్స్ చేయించారు. ఇప్పుడు కూడా ఇదే చేయబోతున్నాడు. శేఖర్ మాస్టర్ మరోసారి కళావతి పాటలో సిగ్నేచర్ స్టెప్ చేయించాడు.,[object Object]](https://images.news18.com/telugu/uploads/2022/02/Mahesh-Babu-Keerthy-Suresh-Sarkaru-Vaari-Paata-News185.jpg)
ఈ పొస్టర్ చూస్తే సినిమాలో యాక్షన్ డోస్ ఎక్కువగానే ఉందని పోస్టర్ చూస్తుంటే అర్థమవుతుంది. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబి ఎంటర్ టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం వహిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే 60 శాతానికి పైగా పూర్తయింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

