telugu navyamedia
సినిమా వార్తలు

‘సర్కారు వారి పాట’ నుంచి ఎగ్జైటింగ్ అప్‌డేట్‌..

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న‌ సినిమా ‘సర్కారు వారి పాట’ . ఈ సినిమాకు సంబంధించిన ఒక్క పాట చిత్రీకరణ మినహా మొత్తం షూటింగ్ పూరైయ్యింద‌ని చిత్ర‌బృందం వెల్ల‌డించింది. అలాగే ఇక నుంచి సినిమాకి సంబంధించిన ఎగ్జైటింగ్ అప్‌డేట్స్‌ ఇస్తామని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పేర్కొంది.

Sarkaru Vaari Paata: Mahesh Babu, Keerthy Suresh's romantic number 'Kalavathi' surpasses 12 million views | Telugu Movie News - Times of India

ఈ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో మహేశ్ బాబు సరసన తొలిసారి కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటిస్తోంది.గతంలో ఎన్నడూ చూడని మహేశ్ ను సరికొత్త అవతారంలో చూపించబోతున్నాడు పరశురామ్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని రెండు పాటలు యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్నాయి.

Sarkaru Vaari Paata:'Kalaavathi' song promo amplifies the buzz | Telugu Movie News - Times of India

మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ ప‌తాకాల‌పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 12న సినిమా థియేట‌ర్‌లో విడుద‌ల కాబోతుంది.

Related posts