telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

విడుదలకు ముందే సర్కారు వారి పాట సరికొత్త రికార్డు…

విడుదలకు ముందే మహేష్ బాబు సర్కారు వారి పాట సరికొత్త రికార్డు సృష్టించింది. గతేడాది సరిలేరు నీకెవ్వరూ సినిమా తరువాత మహేష్ చేస్తున్న మొదటి సినిమా ఇది. ఈ చిత్రం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఇందులో మహేష్ సరికొత్త లుక్స్‌లో కనిపించనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా మహానటి కీర్తిసురేష్ చేస్తోంది. అయితే ఈ సినిమా బ్యాంక్ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా చిత్రీకరణ నిమిత్తం చిత్ర టీం ఇటీవల దుబాయ్‌కు వెళ్లారు. ఇదిలా ఉంటే ఇటీవల సర్కారు వారి పాట ట్విట్టర్‌లో కొత్త రికార్డ్‌ను సృష్టించింది. సర్కారు వారి పాట ట్యాగ్‌తో ఇప్పటికి దాదాపు వంద మిలియన్ల ట్వీట్‌లు వచ్చాయి. దీంతో ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నడూ లేని విధంగా ఈ సినిమా రికార్డు చేసింది. మహేష్ అభిమానులు ఈ రికార్డును సినిమా కూడా ప్రారంభం కాకముందే సాధించారు. దీంతో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో సర్కారు వారి పాట ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా టీజర్ కోసం మహేష్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది.

Related posts