telugu navyamedia
వార్తలు సామాజిక

విదేశీ కరెన్సీతో వినాయక విగ్రహం

currency ganeshkarnataka

వినాయక చవితి పండగకు ముందే వివిధ ఆకృతుల్లో గణనాథులు ముస్తాబవుతుంటారు. విగ్రహాలకు రూపురేఖలు దిద్దుతూ వినూత్న పద్ధతులలో  తయారు చేస్తుంటారు. కొందరు కూరగాయలతో, మరికొందరు కరెన్సీ నోట్లతో, ఇంకొందరు ఇతర వస్తువులతో గణేశ్‌ ప్రతిమలను తయారు చేసి చూపరులను ఆకట్టుకునేలా చేస్తుంటారు.

అయితే కర్ణాటకలోని ఉడుపికి చెందిన మణిపాల్‌ శాండ్‌ హార్ట్‌ టీమ్‌కు చెందిన ముగ్గురు కళాకారులు 21 దేశాలకు చెందిన కృత్రిమ కరెన్సీతో వినాయకుడి ప్రతిమను ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం పొడవు 12 ఫీట్లు. పెద్ద మొత్తంలో ఇండియా కరెన్సీని ఉపయోగించారు. ఇక శ్రీలంక, బంగ్లాదేశ్‌, చైనా, ఆప్ఘనిస్థాన్‌, భూటాన్‌, యూఏఈ, యూఎస్‌, ఇజ్రాయెల్‌తో పాటు పలు దేశాల కరెన్సీని ఉపయోగించి గణేశ్‌ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ వినాయకుడికి విశ్వ ధనదీప గణేశగా నామకరణం చేశారు.

Related posts