telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

చిరంజీవి సినిమాకు ‘నో’ చెప్పిన వివేక్ ఒబెరాయ్

Vivek-Oberoi

మలయాళంలో విజయవంతమైన `లూసిఫర్`‌ను మెగాస్టార్ చిరంజీవి తెలుగులోకి రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. యంగ్ డైరెక్టర్ సుజీత్ కు మెగాస్టార్‌ని డైరెక్ట్ చేసే అవ‌కాశం ద‌క్కింది. ‘లూసిఫ‌ర్’ రీమేక్ రైట్స్ రామ్ చ‌ర‌ణ్ ద‌క్కించుకున్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌ని సెట్స్ పైకి తీసుకెళ్ల‌నుండ‌గా, లాక్ డౌన్ స‌మ‌యంలో ప్రాజెక్ట్‌కి సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్తి చేశాడ‌ట సుజీత్. తెలుగు నేటివిటీకి త‌గ్గ‌ట్టు ఇందులో మార్పులు చేసాడ‌ని తెలుస్తుంది. ఏడాది చివ‌ర‌లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ల‌నున్న‌ట్టు సమాచారం. ఇక బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలోనూ విలన్ పాత్రల్లో రాణిస్తున్న నటుడు వివేక్ ఒబేరాయ్ `లూసిఫర్` తెలుగు రీమేక్‌లో నటించేందుకు నిరాకరించాడట. మాతృకలో విలన్ పాత్రలో కనిపించిన వివేక్‌నే తెలుగులోకి కూడా తీసుకోవాలని చిత్రబృందం భావించిందట. వివేక్‌తో సంప్రదింపులు కూడా జరిపారట. అయితే మరోసారి అదే పాత్రలో కనిపించేందుకు వివేక్ నిరాకరించాడని సమాచారం. దీంతో ఆ పాత్రకు నటుడు రహమాన్‌ను తీసుకున్నారట. గతంలో మెగాస్టార్ `ఖైదీ నెంబర్ 150`లో విలన్ పాత్రను కూడా వివేక్ తిరస్కరించాడు.

Related posts