వారిద్దరు ఒకరినొకరు మనసారా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకొని కలిసి జీవించాలనుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి ముహూర్తం కూడా పెట్టారు. కానీ, విధి వారిని వంచించింది. కరోనా నేపథ్యంలో వారి పెళ్లి వాయిదా పడింది. ఇక తమ పెళ్లి జరగదని భావించి ఆ యువతీయువకులు పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం కంపూర్‌లో చోటు చేసుకుంది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతులు కన్నాపూర్‌కు చెందిన గణేశ్, కంపూర్‌కు చెందిన సీతా బాయిగా గుర్తించినట్లు తెలిపారు. లాక్‌డౌన్‌కు ముందు వారిద్దరి వివాహ నిశ్చితార్థం జరిగిందని చెప్పారు. లాక్‌డౌన్ కారణంగా వివాహాన్ని వాయిదా వేసుకోవాలని పెద్దలు సూచించారు. దీంతో ఆ ప్రేమికులు తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహతకు పాల్పడ్డారని తెలిపారు.
జైల్లో ఉన్నవారు 90 శాతం బీదవారే: వీకే సింగ్