వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి పోలీసులు షాక్ ఇచ్చారు. ఆయనను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో వారెంట్ కోరుతూ కోర్టులో సిట్ అధికారులు పిటిషన్ వేశారు.
కాగా మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి వేసిన ముందస్తు బెయిల్ పిటీషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసిన సంగతి తెలిసిందే.
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది . ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
ఈ నేపథ్యంలో ఈరోజు మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన సుప్రీం కోర్టు.. మిథున్ రెడ్డికి వ్యతిరేకంగా తీర్పు వెలువరించింది.
ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టేసింది. తాజాగా సిట్ అధికారులు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు వారెంట్ కోరుతూ విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
మిథున్ రెడ్డిని త్వరలోనే అరెస్ట్ చేస్తారంటూ చర్చ జోరందుకుంది. ప్రస్తుతం మిథున్ రెడ్డి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

