నల్లగొండ జిల్లా మిర్యాలగూడ హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృతకు వేధింపులు ఆగడం లేదు. ప్రణయ్‌ను మరచిపోవాలని అమృతకు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. ఈ నెల 11న ప్రణయ్ వర్ధంతి రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి ఓ కవర్‌ను డోర్‌కు తగిలించి వెళ్లాడు.
సాయంత్రం ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు కవర్ తెరిచిచూశారు.. ఆ లెటర్‌లో అడ్రస్ రాసి ఉంది. గోనె సతీష్, బొబ్బిలి మండలం, విజయనగరం జిల్లా, ఫోన్ నెంబర్ రాసి పెట్టాడు. అమృతకు ఇష్టమైతే పెళ్లి చేసుకుంటానని ఆ లేఖలో రాసి పెట్టాడు. ఈ ఘటనపై అమృత, ప్రణయ్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలను పరిశీలించారు. గుర్తుతెలియని వ్యక్తి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.