అకుంఠిత దీక్షాపరుడు ,అక్షరాన్ని ఆయుధంగా మలచి సమాజానికి మేలుచేసినవాడు ,నిత్యాన్వేషి ,పాత్రికేయ దిగ్గజం ,ఈనాడు సంస్థల అధినేత, నిర్మాత, ఎంతో మందికి జీవనోపాధి కల్పించిన వ్యక్తి చెరుకూరి రామోజీ రావు గారి హఠాన్మరణం జీర్ణించుకోలేని నిజం.
వారి కుటుంబ సభ్యులకు తెలుగు సినీ రచయితల సంఘం తరఫున సంతాపాన్ని తెలియజేస్తూ , వారి ఆత్మకు శాంతి కలగాలని ,పుణ్యలోక ప్రాప్తి కలగాలని ఆ సర్వేశ్వరున్ని కోరుకుంటూ . . . ప్రార్ధిస్తున్నాము.
డా.పరుచూరి గోపాలకృష్ణ,
తెలుగు సినీ రచయితల సంఘం.