telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

బీజేపీ ర్యాలీ పై .. పశ్చిమ బెంగాల్ పోలీసుల లాఠీ ఛార్జ్.. ఉద్రిక్తంగా పరిస్థితులు.. !

lathi charge on bjp rally in west bengal

తాజాగా, బీజేపీ కార్యకర్తలు నిర్వహించిన విజయ్ సంకల్ప్ బైక్ ర్యాలీపై పోలీసులు లాఠీలు ఝళిపించడంతో పశ్చిమ బెంగాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముందస్తు ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న ఈ ర్యాలీని మిడ్నాపూర్‌లో బీజేపీ చీఫ్ అమిత్ షా ప్రారంభించారు. వార్షిక పరీక్షలు జరుగుతుండడంతో ఈ ర్యాలీలకు పశ్చిమ బెంగాల్ పోలీసులు అనుమతి నిరాకరించారు. ట్రాఫిక్ జామ్‌ల కారణంగా విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొంటూ అనుమతి నిరాకరించారు.

పోలీసుల ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోని బీజేపీ నేతలు ఎక్కడికక్కడ ర్యాలీలు చేపట్టారు. మిడ్నాపూర్‌లో పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను విరగ్గొట్టి మరీ రోడ్లపైకి ప్రవేశించారు. దీనితో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. బీజేపీ కార్యకర్తలు పోలీసులపై తిరగబడడంతో ఆ ప్రాంతం రణరంగంలా మారింది. పోలీసుల లాఠీ చార్జీలో పలువురు బీజేపీ కార్యకర్తలు గాయపడగా, వారి దాడిలో పోలీసులు కూడా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.

Related posts