అక్కినేని కోడలు సమంత తాజాగా తన భర్తపై చేసిన సరదా ట్వీట్ నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. బుధవారం రామానాయుడు స్టూడియోలో రానా, మిహీకాల రోకా వేడుక జరుగగా, ఈ కార్యక్రమానికి నాగచైతన్య, సమంత హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో వారిరివురు దిగిన ఫోటోలని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది సమంత. దగ్గుబాటి యంగ్ జనరేషన్ అంతా కలిసి దిగిన ఫోటోతో పాటు నాగ చైతన్య సోలో ఫోటోని షేర్ చేసింది. ఈ ఫోటోకి కామెంట్‌గా మమ్మీ, ఆంటీస్, ఫ్రెండ్స్, సిస్టర్స్ అందరిని పంపిన తర్వాత ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ టైం వచ్చింది. నా భర్త చాలా అందంగా కనిపిస్తున్నారు కదా? (భర్త ఎక్కడో పెద్ద గొయ్యి తవ్వుతున్నాడు) అంటూ ఫన్నీ కామెంట్ పెట్టింది. సామ్ పోస్ట్‌కి స్పందించిన నాగ చైతన్య.. ఇదేదో ఇతరుల భాగస్వామ్యంతో చేసిన పెయిడ్ పోస్ట్‌లలో ఒకటిగా కనిపిస్తుందని అన్నారు.
Latest Clicks of adorable couple #ChaySam @chay_akkineni @Samanthaprabhu2 pic.twitter.com/xY1kJP7kfQ
— BARaju (@baraju_SuperHit) May 22, 2020
నా ప్రకటనలను అతనే నియంత్రించాడు… “గురూజీ” అంటూ పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు