telugu navyamedia
సామాజిక

కుక్కల బెడద ను నియంత్రించడానికి జిహెచ్ఎంసి పటిష్ట చర్యలు

హై లెవెల్ కమిటీ సిఫార్సు మేరకు యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ మార్గదర్శకాలను అనుసరించి జిహెచ్ఎంసి పటిష్టమైన చర్యలు

జిహెచ్ఎంసి  పరిధిలో కుక్కల బెడదను నియంత్రించడం,  కుక్క కాటు సంఘటనలను నిరోధించడం పై మేయర్ అధ్యక్షత  ఏర్పాటు అయిన హై లెవెల్ కమిటీ సిఫార్సు మేరకు యానిమల్ వెల్ఫేర్ బోర్డు మార్గ దర్శ కాలను ననుసరించి జిహెచ్ఎంసి పటిష్టమైన చర్యలు చేపట్టింది.

ముఖ్యంగా కుక్క కాటు సంఘటనలు పునరావృతం కాకుండా నిరోధించడం, వీధి కుక్కల బెడదను నియంత్రణ కోసం చేపట్టవలసిన   విస్తృతమైన పటిష్ట చర్యలు  జి హెచ్ఎంసి చేపట్టింది. ఉత్పన్నమైన సమస్యలను అధిగమించేందుకు కొన్ని తాత్కాలిక, శాశ్వత చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.    అందుకోసం  మానవ వనరులను ఏర్పాటు, కుక్కలను పట్టుకునే వాహనాల ,వీధి కుక్కల స్టెరిలైజేషన్‌ పెంచడంతో పాటుగా అవగాహన కల్పించడం.

ప్రస్తుతం ఉన్న జంతు సంరక్షణ కేంద్రాల్లో మరిన్ని స్టెరిలైజేషన్లు చేపట్టేందుకు మౌలిక సదుపాయాలను పెంచడం, చార్మినార్,  శేరిలింగంపల్లి జోన్లలో  జంతు సంరక్షణ కేంద్రాల సత్వర ఏర్పాటు, ఏబీసీ సంఖ్యను పెంచడం.  ఎక్కువ సంఖ్యలో స్టెరిలైజ్ చేయని కుక్కలను రాత్రి షిఫ్టులో  పట్టుకునేందుకు నిర్ణయం. వేసవిలో
వీధి కుక్కలకు నీరు అందించడం కోసం పెద్ద ఎత్తున నీటి కొలనులను ఏర్పాటు చేయడం,   ఫంక్షన్ హాళ్లు, హోటళ్లు, హాస్టళ్లు, నాన్ వెజ్ ఆహార వ్యర్థాలను సక్రమంగా పారవేసేందుకు ప్రత్యేక ఏర్పాటు, స్టెరిలైజేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలని పక్కనే ఉన్న మున్సిపాలిటీలను అభ్యర్థించడం జరిగింది. ఇంకా అనేక అవసరమైన చర్యలు ఈ విధంగా ఉన్నాయి.

1. స్టెరిలైజేషన్‌లను పెంచడానికి ఇప్పటికే ఉన్న 16 ప్రైవేట్ పశువైద్యులకు అదనంగా 8 మంది ప్రైవేట్ పశువైద్యులను నియామకానికి చర్యలు.

2. ప్రస్తుతం ఉన్న 30 కుక్కలను పట్టుకునే వాహనాల సంఖ్యను  20కి పెంచి అందుకు అనుగుణంగా  సిబ్బంది నియామకం.  GHMC కి చెందిన  కుక్కలను పట్టుకునే వాహనాలు 12 గాను  డ్రైవర్లు, 60 డాగ్ క్యాచర్‌లు గరిష్ట సంఖ్యలో వీధి కుక్కలను స్టెరిలైజ్ చేయడానికి రాత్రి షిఫ్టులలో పని చేయుటకు చర్యలు.

3. ఎన్జీవోలు, ఏడబ్లుఓ లు,/వాలంటీర్లు, జంతు సంరక్షణ కార్యకర్తలు మరియు ఎన్నికైన స్థానిక ప్రజాప్రతినిధులను  రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్‌లు, స్లమ్ లెవెల్ ఫెడరేషన్‌లతో పాటుగా పాఠశాల పిల్లలకు వీధి కుక్కల ప్రవర్తన  వీధి కుక్కలతో వ్యవహరించడంలో చేయవలసినవి,  చేయకూడని విషయాల పై  అవగాహన కల్పించబడినది. అందులో బాగంగా 1111  రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్, స్లమ్ లెవెల్  ఫెడరేషన్ లకు, 1066 పాఠశాలలో గల  2,28,614 మంది విద్యార్థులకు అవగాహన కల్పించనైనదీ.

4. షార్ట్ ఫిల్మ్ వీడియో కాంటెస్ట్, ఫిల్మ్ యాడ్స్,  టీవీలలో స్లైడ్ షోలు థియేటర్లలో  సినిమా ప్రదర్శనకు ముందు అవగాహన కల్పించేనందుకు చర్యలు.

5.  చుడీబజార్‌లో ప్రస్తుతం ఉన్న జంతు సంరక్షణ కేంద్రం ప్రాంగణంలో మరింత సౌకర్యం కోసం అదనంగా  850 ఫీట్లు గల  షెడ్ ఏర్పాటు చేసి అందులో 20 బోనుల ఏర్పాటు వలన అందులో 80 కుక్కలను ఒక వారంలో ఉంచ వచ్చును.   చార్మినార్‌ జోన్  కాటేదాన్‌లో మరో పశుసంరక్షణ కేంద్రం నిర్మాణం పనులు మరో పక్షం రోజుల్లో ప్రారంభం కానున్నది. దీనితో పాటు, శేరిలింగంపల్లి జోన్ నల్లగండ్లలో మరో పశుసంరక్షణ కేంద్రాన్ని నిర్మాణానికి అన్ని పనులు పూర్తి చేశారు.

6. పీపుల్‌ ఫర్‌ యానిమల్స్‌, బ్లూక్రాస్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో స్టెరిలైజేషన్‌ను పెంచేందుకు వారిని ఒప్పించడంతో పీపుల్‌ ఫర్‌ యానిమల్స్‌ ఆధ్వర్యంలో వీధి కుక్కల స్టెరిలైజేషన్‌ను రోజుకు 15 నుంచి 40కి పెంచారు. హైదరాబాద్‌కు చెందిన బ్లూ క్రాస్‌ ఆధ్వర్యంలో రాజేంద్రనగర్‌ సర్కిల్‌ లో ఇటీవల రోజుకు 20 చొప్పున  వీధి కుక్కల స్టెరిలైజేషన్‌ను ప్రారంభించారు.

7. GHMC, AWOS, వాలంటీర్ల  సహాయంతో ప్రజాప్రతినిధుల సహకారంతో వేసవిలో వీధి కుక్కల కోసం నీటి కొలలను ఏర్పాటు చర్యలు తీసుకోగా ఇప్పటివరకు 2453 నీటి కొలను (గుంతలు) ఏర్పాటు చేశారు.

8. మాంసాహార విక్రయ కేంద్రాలు, వ్యాపారులు చెత్తను, వ్యర్థాలను, వీధిలో  గాని బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా వాణిజ్య వ్యర్థాలను సురక్షితంగా పారవేయడం కోసం ఆమోదించబడిన ఏజెన్సీకి అప్పగించాలని ఆదేశించింది. లేని పక్షంలో చట్ట రీత్యా చర్యలు తప్పవని 4001 షాపులకు హోటళ్ల కు నోటీసులు జారీ చేశారు.

9. GHMC పరిసర  మున్సిపాలిటీలలో గల వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ చేయాలని  మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ  ప్రత్యేక  ప్రధాన కార్యదర్శి ఆదేశించగా 14 పరిసర మున్సిపాలిటీలు అనిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ ల సహాయంతో జనన నియంత్రణ, యాంటీ రెబీస్  కార్యక్రమాన్ని ప్రారంభించాయి.

10. ప్రస్తుతం ఉన్న జోనల్ స్థాయి ఏబీసీ మానిటరింగ్ కమిటీల్లో ప్రజాప్రతినిధులను చేర్చుకొని, రేబిస్ లక్షణాలు ఉన్న అనుమానిత కుక్కలను పరీక్షించేందుకు ఏర్పాట్లు చేయాలని జోనల్ కమిషనర్‌లకు ఆదేశాలు జారీ చేశారు.

11. పశువైద్యాధికారులు కుక్కల పెంపకం సంస్థలును, పెట్ షాపులను తనిఖీ చేసి, తప్పు చేసిన పెంపకందారులు మరియు పెట్ షాప్ యజమానులపై విచారణ చేసి చట్ట ప్రకారం జరిమానాలు విధించాలని  చర్యలు తీసుకోవాలి క్షేత్ర స్థాయి పశువైద్య అధికారులకు ఆదేశాలు జారీ.

12. వీధి కుక్కల దత్తత డ్రైవ్‌లను స్థానిక ప్రజా ప్రతినిధులు అనిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ స్వచ్ఛంద సంస్థ పెద్ద ఎత్తున చేపట్టేందుకు క్షేత్రస్థాయి అధికారులు ఆదేశాలు జారీ.

13. కుక్కల బెడదను తగ్గించడానికి స్వచ్ఛంద  సేవకులు, వాలంటీర్లు,  స్థానిక ప్రజా ప్రతినిధులకు వారి వారి ప్రాంతాలలో డాగ్ స్క్వాడ్‌ల సమాచారాన్ని తెలియ జేయడం  మూలంగా, తద్వారా వారు తమ ప్రాంతాల్లో 100% స్టెరిలైజేషన్ కోసం వీధి కుక్కలను పట్టుకోవడం సాధ్యమౌతుంది..

15.  “డాగ్ క్యాచింగ్ స్క్వాడ్” ఉన్న వాహనానికి పేరును ఇక నుండి “GHMC డాగ్ బర్త్ కంట్రోల్ యూనిట్”గా మార్చబడింది ఇట్టి వాహనం పై అవగాహన కోసం స్టెరిలైజ్ చేసిన కుక్క (చెవి నోచ్డ్) ఫోటోలను ప్రదర్శించ నైనది.

16. GHMC పరిధిలో 10 తగ్గకుండా  ఫీడింగ్ స్పాట్‌లను గుర్తించి, అనిమల్ వెల్ఫేర్ బోర్డు అఫ్ ఇండియా  (AWBI ) నిబంధనల ప్రకారం స్థానిక కుక్కలకు ఆహారం, వాటి సంక్షేమం కోసం శ్రద్ధ వహించడానికి ప్రతి కాలనీలోని కమ్యూనిటీ జంతు సంరక్షకులను ప్రోత్సహించాలని వెటర్నరీ  డిప్యూటీ డైరెక్టర్ లకు ఆదేశాలు.

17. బార్కాస్, జంగమెట్‌ ఇతర ప్రాంతాల  ప్రభుత్వ, ఏరియా ఆసుపత్రుల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో  కుక్కకాటు బాధితులకు పోస్ట్ ఎక్స్‌పోజర్ ప్రొఫిలాక్సిస్ లే, యాంటీ రేబీస్ వ్యాక్సిన్ మరియు రేబిస్ ఇమ్యునోగ్లోబులిన్‌లను అందుబాటులో తేవడానికి జిహెచ్ఎంసి చర్యలు చేపట్టింది.

18. GHMC అభ్యర్థన మేరకు, తెలంగాణ రాష్ట్ర పశువైద్య, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ మహదేవ్‌పూర్‌లోని GHMC జంతు సంరక్షణ కేంద్రాన్ని తనిఖీ చేశారు. జంతు సంరక్షణ కేంద్రంలో అందుబాటులో ఉన్న ఆపరేషన్ థియేటర్, సౌకర్యాలపై సంతృప్తి చెందారు. జిహెచ్ఎంసిలో  పనిచేస్తున్న  వెటర్నరీ అధికారులతో పాటు  ప్రైవేట్ పశువైద్యులకు స్టెరిలైజేషన్‌పై  శిక్షణ ఇవ్వడానికి సబ్జెక్ట్   నిపుణులను నియమించారు. అంతేకాకుండా  వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ చేయడానికి పైలట్ ప్రాజెక్ట్ ప్రాతిపదికన లాపరోస్కోపిక్ పరికరాలను కొనుగోలు చేయడంలో సాంకేతిక సాధ్యాసాధ్యాలు మార్గదర్శకాల పై  GHMCకి సూచనలు  అందించాలని ఆ శాఖ  కమిషనర్,  డైరెక్టర్ ఆదేశాలు.

19.  అత్యధిక సంఖ్యలో స్టెరిలైజేషన్ చేయని వీధి కుక్కలను పట్టుకునేందుకు రోజూ రాత్రి షిఫ్టులో కుక్కలను పట్టుకునే వాహనాలను నడపాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్  డిప్యూటీ, అసిస్టెంట్ డైరెక్టర్ (వెటర్నరీ)లకు  ఆదేశించారు.

20.  GHMC పరిధిలో చెత్తను సక్రమంగా పారవేసేలా అంతేకాకుండా కుక్కలు గుమిగూడకుండా ఫంక్షన్ హాళ్లు, హోటళ్ల నుండి మాంసాహార ఆహార వ్యర్థాలను ఎత్తివేసేందుకు ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు కు అడిషనల్ కమిషనర్ శానిటేషన్ కు ఆదేశాలు.

21.  కుక్కల బెడదను సమర్థవంతంగా నియంత్రించడానికి, కుక్క కాటు సంఘటనలను నివారించడానికి ఉన్నత స్థాయి కమిటీ  అన్ని సిఫార్సులను అమలు చేయుటకు నిర్ణయించారు.

Related posts