పుస్తక పఠనం ఒక ఆరోగ్యకరమైన అలవాటని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలో నూతనంగా 3.60 కోట్ల వ్యయంతో నిర్మించిన డా. సి. నారాయణ రెడ్డి స్మారక గ్రంథాలయ భవనంను ఎమ్మెల్యే కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లా కేంద్రంలో గ్రంధాలయంను ఏర్పాటు చేసుకోవడం గర్వంగా ఉందన్నారు. టెక్నాలజీ యుగంలో పుస్తకాల్ని బతికించటం కోసం ఇదొక చిరుప్రయత్నం అని అభివర్ణించారు.
స్మార్ట్ ఫోన్, ఐ ఫోన్ లకే పరిమితమైన పస్తుత పరిస్థితులలో పుస్తక పఠనంపై విద్యార్థులలో ఆసక్తిని పెంచేందుకే అధునాతన సౌకర్యాలతో జిల్లా కేంద్ర గ్రంధాలయంను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సిరిసిల్ల జిల్లా ప్రజలకు గ్రంధాలయం చిరుకానుక అని అన్నారు .పచ్చ తోరణం గా గ్రంధాలయం వర్దిల్లాలని ఆకాంక్షించారు. సాహితి, చర్చా గొష్ట్ లకు గ్రంధాలయం వేదికగా ఉండాలన్నారు.